![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న తొలి పాన్-ఇండియా మూవీ `పుష్ప`. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. రెండు భాగాలుగా రాబోతోంది. వాస్తవానికి మొదట ఒకే పార్ట్ గా తీయాలని అనుకుని సెట్స్ పైకి వెళ్ళిన సుక్కు అండ్ టీమ్.. స్టోరీలో ఉన్న డెప్త్, స్పాన్ రీత్యా చిత్రీకరణ సాగుతున్న సమయంలో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో.. పాత్రల పరిధి పెరగడం, కొత్త పాత్రలు ప్రవేశించనుండడం, నటీనటులకు - సాంకేతికనిపుణులకు వర్కింగ్ డేస్ పెరగడం.. ఇతరత్రా కారణాల వల్ల బడ్జెట్ కూడా పెరిగిందని టాలీవుడ్ బజ్. ఓవరాల్ గా.. రూ. 250 కోట్ల భారీ మొత్తంతో `పుష్ప` సిరీస్ తెరకెక్కనుందట. బన్నీ, సుక్కు కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ కావడం విశేషం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న `పుష్ప`లో అల్లు అర్జున్ కి జంటగా `నేషనల్ క్రష్` రష్మిక మందన్న నటిస్తోంది. ప్రతినాయకుడిగా మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ దర్శనమివ్వనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |